Facebook Twitter
విగ్రహం నిగ్రహం

నీ దాహం
తీర్చే మంచినీరు
ఏ నీళ్ళ బాటిల్లోనో
ఏ స్టీల్ గ్లాసులోనో
ఏ రాగిచెంబులోనో ఉన్నట్లే...

నీ కోర్కెలు తీర్చేటి
నీ ఆరాధ్య దైవం
ఏ‌ కోవెలలోనో
కొలువై ఉంటాడు...

నీలో నిగ్రహం కోసం
ఏ గర్భగుడిలోనో
ఒక సుందరమైన
విగ్రహమై ఉంటాడు...