Facebook Twitter
నీవు హిందువు నా ప్రియబంధువు

మొన్న...
నీతికి నిర్భీతికి
నిజాయితీకి
ఒక నిదర్శనం నీవు

నిన్న...చెడు
సంస్కృతులకు
చెందవు నీవు
పోరుతో లాభం
పొందవు నీవు
అందరి ఊహలకు
అందవు నీవు

భిన్నత్వంలో
ఏకత్వానికి
కేంద్ర బింధువు నీవు
అనాధ శరణార్ధులకు
ఆత్మ బంధువు నీవు

కానీ ఎందుకో నేడు...
హింసకు ప్రతి హింస
అంటున్న హిందువు నీవు
మతాన్ని మత్తు మందుగా
వాడుచుందువు నీవు...
హిస్టరిలో ఓ మిస్టరిగానె
మిగిలి వుందువు నీవు

నీవు హిందువు
నా ప్రియ బంధువు
నా హితవాక్కు
విందువు నీవు
అందుకే ఈ
శుభసందేశం నీకొరకే...

మంచితనానికి...
మచ్చలేని వ్యక్తిత్వానికి...
పరిమళించే మానవత్వానికి...
ప్రపంచానికి
ప్రాణవాయువువైన
మతసామరస్యానికి...
ఇక నీవే ఒక ప్రతిబింబమై పోవాలి
నీలో విప్లవాత్మకమైన మార్పు రావాలి
నీ కీర్తిప్రతిష్టలు విశ్వవ్యాప్తమై పోవాలి
ఈ జగతికి నీవే స్పూర్తిప్రదాతవు కావాలి