Facebook Twitter
కామాంధులుంటారు కాస్త జాగ్రత్త!

పిల్లల ఫీజులరూపంలో డబ్బుల
"కట్టలు" సమర్పించుకొని
కార్పొరేట్ స్కూళ్లలో పిల్లలను
చేర్పించి వారి ఖరీదైన పుస్తకాలకు
"అట్టలు" వేయకుంటే స్కూలులో
పిల్లలను టీచర్లు తిట్టరా ? కొట్టరా ?

ఆ పిల్లలే పెరిగి పెద్దవారై
కార్పొరేట్ కాలేజీలకెళ్ళినప్పుడు
వారు పబ్బులు క్లబ్బులంటూ
ఫ్యాషన్ల పేరుతో విచ్చలవిడిగా
బరితెగించి తిరుగుతున్నప్పుడు
అందాలపోటీలంటూ పారిస్ లోని
ఒంపుసొంపులుఒలకబోస్తూ
ఒయ్యారి భామల్లా ఫ్యాషన్లపేరిట
దిక్కుమాలిన ఫారిన్ కల్చర్ ను
దిగుమతి చేసుకొని కురుచ
"బట్టలు" వేసుకొని నడిరోడ్డుపైన
నవ్వుతూ కవ్విస్తూ పోతూవుంటే
పోకిరివెధవలు వెంటపడరా?
దొంగచూపులు చూడరా ?
వెకిలి చేష్టలు చేయరా ?

గుర్తుంచుకోండి ! ఓ అమ్మాయిలారా !
"కట్టెలు" పెట్టి పాలకుండ కింద
మంట పెట్టిన వేళ పొంగిపొరలేది
పాలుకాదు మీ ఇంటి పరువేనని...

గుర్తుంచుకోండి ! ఓ తల్లిదండ్రులారా !
బరితెగించి తిరిగేది బాపుబొమ్మలు కాదు
దిగుమతి చేసుకున్న దిష్టిబొమ్మలేనని...

అందుకే అందాలు ఆరబోసే ఓ అమ్మాయిల్లారా !
మన సంస్కృతీసాంప్రదాయాలను మరువకండి!
ఇకనైనా కళ్ళు తెరచి చూడండి ! మీ ప్రక్కనే
నక్కినక్కి కామాంధులుంటారు కాస్త జాగ్రత్తండి !