ఒక్కసారి...
ఆ బాలరామున్ని
కనులారా చూసిన చాలు...
ఒక్కసారి...
ఆ దివ్య మంగళ
రూపాన్ని దర్శించుకున్న చాలు...
ఒక్కసారి ఆ స్వామి
పాదారవిందాలకు మ్రొక్కిన చాలు...
ఒక్కసారి...
మనసారా జై శ్రీరామ్ అంటూ...
శ్రీరామ నామాన్ని జపించిన చాలు
అనంతమైన ఆత్మతృప్తి ప్రాప్తిస్తుంది...
ఒక్కసారి...
కళ్ళనిండా
కరుణ నిండిన
ఆ బాలరాముని
దివ్యమంగళ రూపాన్ని
తాకిన చాలు తరించిపోతాం..
సంతోష సాగరాన్ని ఈదేస్తాం...
ఆనంద తీరాలను చేరుకుంటాం...
సంభ్రమాశ్చర్యాలకు గురైపోతాం...
ఇక ఈ జన్మ ధన్యమైపోయినట్లేనని...
పొంగిపోతాం పొర్లుదండాలు పెడతాం...
ఒక్కసారి...
ఆ దివ్యమైన
మంగళరూపాన్ని
తిలకించిన చాలు...
తనువంతా తనువులోని
అణువంతా పులకించి పోతుంది పారవశ్యంతో పరవశించిపోతాం... తన్మయత్వంతో తండవమాడతాం...
ఈ కళ్ళు రెండు సరిపోవడం లేదు
మరో వెయ్యి కళ్ళనైనా ఆ పరమాత్మ ఇచ్చుంటే ఎంతబాగుండేదోననిపిస్తుంది



