భక్తులారా..!
రండి రండి..!
బాలరాముని ఆ
దివ్య మంగళరూపం
దర్శించుకుందాం రండి..!
ఎన్నో ఎన్నో ఖరీదైన
బంగారు ఆభరణాలు
ఒంటి నిండా ధరించి...
ఆ మహావిష్ణువు దైవత్వం..!
ఎంతో నవ్యత్వం నవనీతం..!
ఆరేళ్ల బాలుని అమాయకత్వం..! చిరుమందహాసం...ప్రసన్నవదనంతో అపురూపమైన అందంతో...అలరారే
ఆ బాలరాముని....నిలువెత్తు విగ్రహం
దర్శించుకుని ధన్యులమౌదాం రండి..!
ఆ దివ్య మంగళరూపం
ఒక్కసారి తిలకించిన చాలు...
తనువంతా తనువులోని
అణువణువు పులకించిపోతుంది పారవశ్యంతో పరవశించిపోతాం..! తన్మయత్వంతో తండవమాడుతాం..!
ఆ చిరుదరహాసం ఆ ప్రసన్నవదనం
కాంతులీను ఆ అమాయకపు కళ్ళు
చూడ ఈ కళ్ళురెండు సరిపోవడం లేదు
ఆ పరమాత్మ వెయ్యి కళ్ళిస్తే
ఎంత బావుండో అనిపిస్తోంది..!
ఆ అయోధ్యలో ఆ గర్భగుడిలో కొలువైవున్న ఆ బాలక్ రాం ను
దర్శించుకున్న వారి జన్మ ధన్యమే...
దక్కేను వారికి జన్మజన్మల పుణ్యఫలమే



