Facebook Twitter
బాలరాముని దివ్య దర్శనం...

భక్తులారా..!
రండి రండి..!
బాలరాముని
దివ్య మంగళరూపం
దర్శించుకుందాం రండి..!

ఎన్నో ఎన్నో ఖరీదైన
బంగారు ఆభరణాలు
ఒంటి నిండా ధరించి...
ఆ మహావిష్ణువు దైవత్వం...
ఎంతో నవ్యత్వం నవనీతం...
ఆరేళ్ల బాలుని అమాయకత్వం... చిరుమందహాసం...ప్రసన్నవదనంతో అపురూపమైన అందంతో...అలరారే
ఆ బాలరాముని....నిలువెత్తు విగ్రహం
దర్శించుకుని ధన్యులమౌదాం రండి..!

ఆ దివ్య మంగళరూపం
ఒక్కసారి తిలకించిన చాలు...
తనువంతా తనువులోని
అణువణువు పులకించి పోతుంది పారవశ్యంతో పరవశించిపోతాం తన్మయత్వంతో తండవమాడుతాం
ఈ కళ్ళు రెండు సరిపోవడం లేదు
మరో వెయ్యి కళ్ళనైనా ఆ పరమాత్మ ఇచ్చుంటే ఎంతబాగుండేదోననిపిస్తుంది

ఒక్కసారి ఆ దివ్య మంగళ
రూపాన్ని దర్శించుకున్న చాలు...
ఒక్కసారి ఆ స్వామి
పాదారవిందాలకు మ్రొక్కిన చాలు...

ఒక్కసారి ఆ బాలరామున్ని
కనులారా చూస్తే చాలు
మనసారా జై శ్రీరామ్ అంటూ...
ఒక్కసారి శ్రీరామనామం జపిస్తే చాలు
అనంతమైన ఆత్మతృప్తి ప్రాప్తిస్తుంది...

ఒక్కసారి కళ్ళనిండా కరుణ నిండిన
ఆ బాలరాముని దివ్యమంగళ రూపాన్ని
తనివితీరా తాకిన చాలు తరించిపోతాం..
సంతోష సాగరాలను ఈదుతాం...
ఆనంద తీరాలకు చేరుకుంటాం...
సంభ్రమాశ్చర్యాలకుగురైపోతాం...
ఇక ఈ జన్మ ధన్యమైపోయినట్లేనని...
పొంగిపపోతాం పొర్లుదండాలు పెడతాం

మైసూర్ శిల్పి అరుణ్
యోగిరాజ్ చే చెక్కబడిన...
అత్యంత ఆకర్షణ గల
అందమైన సుందరమైన
అరుదైన అపురూపమైన
51 అంగుళాల బాలరాముని విగ్రహం...

ఆథ్యాత్మిక
నగరం అయోధ్యలో
ప్రతిష్టాత్మకంగా నిర్మితమైన
రామాలయంలో గర్భగుడిలో
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీచే
వేదమంత్రాల మంగళవాయిద్యాల మధ్య
శాస్త్రబద్దంగా ప్రాణప్రతిష్ట చేయబడింది
ఒక ప్రతిష్టాత్మకమైన...
ఒక చారిత్రాత్మకమైన...
అయోధ్యలో రామయ్య అడుగిడిన
ఒక అపూర్వమైన ఘట్టం ముగిసింది...
వెయ్యేళ్ల ఒక తీపిజ్ఞాపకమై మిగిలింది...