జయ జయ రామ...
జానకి రామాయని...
నిత్యం శ్రీరామనామం
జపించినవారికి దక్కేను
జన్మజన్మల పుణ్యఫలమే...
నాడు...
అయోధ్యలో
శ్రీరామ జన్మభూమిలో
రామమందిర నిర్మాణంకోసం
జై శ్రీరామ్ జైజై శ్రీరాం అంటూ ...
సోమనాథ్ నుండి అయోధ్య వరకు
అద్వాని చేపట్టిన ఆ రథయాత్రకు...
ఉగ్రరూపం దాల్చిన ఉద్యమాలకు...
బాబ్రీ మసీదు కూల్చివేతకు...
చెలరేగిన మందిర్ మషీద్ మత ఘర్షణలకు అమరులైన వేలాది మంది
కరసేవకులు కన్నకలలకు ప్రతిరూపంగా...
సుప్రీంకోర్టిచ్చిన చారిత్రాత్మక తీర్పుకు
500 ఏళ్ళ పోరాటాలకు ప్రతిఫలంగా...
నేడు...
2024 జనవరి 22 న...అయోధ్యలో
ఎన్నో ఏళ్ళుగా కోట్లాదిమంది హిందువుల
సుందరస్వప్నం సాకారమై నిర్మితమైన
నవ్య దివ్య భవ్య శ్రీరామమందిరంలో...
ప్రతిష్టాత్మకంగా జరిగే బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట మహోత్సవాన్ని
భక్తిశ్రద్ధలతో నియమనిష్ఠలతో ఆర్తితో ఆశతో జైశ్రీరామ్...అంటూ నినదిస్తూ...
దర్శించుకునే భక్తులందరి జన్మధన్యమే...



