అత్యంత భక్తిశ్రద్ధలతో
నిష్టతో నిర్విరామంగా కృషి చేసి
ఆరునెలలు శ్రమించి అందంగా
చెక్కిన రాంలాల్లా విగ్రహంలోని
చిహ్నాలతో అత్యంత విశిష్టమైనవి...
సూర్య భగవానుని...చిహ్నం
శ్రీరాముని సూర్యవంశానికి...
క్రమశిక్షణకు శాశ్వితత్వానికి స్థిరత్వానికి..
శేషనాగు...చిహ్నం
శ్రీ మహావిష్ణువు ప్రవళించే పాన్పుకు...
ఓం...చిహ్నం
సుప్రభాతవేళ సూర్యనమస్కారానికి...
సనాతన ధర్మానికి...సంప్రదాయానికి...
గద...చిహ్నం
నమ్మిన బంటు
ఆంజనేయుని ఆయుధం...
శ్రీరాముని దృఢసంకల్పానికి...
బలపరాక్రమాలకు...ధైర్యసాహసాలకు...
స్వస్తిక్...చిహ్నం
మన సంస్కృతికి...సాంప్రదాయాలకు
సకల శుభాలకు...ఘన విజయాలకు...
ప్రకాశం...చిహ్నం
కాలచక్రానికి...
సస్త లోకాలకు..సువిశాల విశ్వానికి...
విల్లు...చిహ్నం
శ్రీరాముని ఆయుధానికి విలువిద్యకు...
ఈ సనాతన ప్రతీకలే...ప్రతిరూపాలు...
ఇలా 51 అంగుళాలలో ఒకే కృష్ణశిలలో
శ్రీ మహావిష్ణువు దివ్యరూపం ఉట్టిపడేలా శ్రీరామ చంద్రమూర్తికి ఒక "ఆరాధనీయ దైవంగా" అపురూపమైన ఆకృతినిచ్చిన
మైసూర్ మహాశిల్పి అరుణ్ యోగిరాజ్
అభినందనీయుడు అదృష్ట జాతకుడు
జై శ్రీరామ్... జైజై శ్రీరామ్...



