"అక్కర"
అనగానే చక్కగా
"స్పందించే"
వారి జీవితాలు
"ఆపద"
అనగానే
స్నేహహస్తం
"అందించే"
వారి జీవితాలు
ప్రతినిత్యం
చిరునవ్వులు
"చిందించే"
వారి జీవితాలు
అందరి
ఆకలి బాధల్ని
"బంధించే"
వారి జీవితాలు
పేదలకు
అనాధలకు
"ప్రేమను...పంచే"
వారి జీవితాలు
అందరి శ్రేయస్సు
గురించి నిరంతరం
"ఆలోచించే"
వారి జీవితాలు
ఎప్పుడు
ఎల్లప్పుడూ
పచ్చపచ్చగానే ఉంటాయి
వారి జీవితం ఎందరికో ఆదర్శం
వారే పరమాత్మకు ప్రతిరూపాలు
వారే చిరంజీవులు చిరస్మరణీయులు
ఓ కవి స్నేహాన్ని ఇలా వర్ణిస్తున్నాడు
నిజమైన మిత్రులకు మించిన ఆస్తిలేదని....
స్నేహానికి ఎల్లలు లేవని అది సరిహద్దుల్ని చెరిపేస్తుందని...
అది వికాసానికి వినోదానికి బాటలు వేస్తుందని....
మంచిమిత్రుడు తోడుంటే ఆయుధంధరించినంత ధైర్యమని
జీవితమనే ఉద్యానవనంలో అందమైన పుష్పం స్నేహమని...
హృదయపు తలుపును ఒక్కసారి తడితే..
అందులోని మాధుర్యమంతా ప్రతిహృదిలో గుబాళిస్తుందని
ప్రతిఫలాన్ని ఆశించని ఆ స్నేహబంధం
మొగ్గలా ప్రారంభమై..
మహావృక్షంగా ఎదిగి జీవితాంతం తోడుగా ఉంటుందని...
ఇద్దరు వ్యక్తులకు, ఇరువురి మనసులకు సంబంధించిన
ఈ 'స్నేహం' తరతరాలకు తీపిని పంచుతుందని... కాలాలకతీతంగా మైత్రి మధురిమను పెంచుతోందని...
కన్నవారితో, కట్టుకున్నవారితో, తోడబుట్టినవారితో చెప్పుకోలేని విషయాలను మిత్రులతో చెప్పుకోవడం మిత్రత్వలోనీగొప్పదనమని...
స్నేహమెంతో ఎంతో తియ్యనైందని...
అమ్మ ప్రేమ, స్నేహం ఈ రెండే జీవితంలో ముఖ్యమని... స్నేహితులతో కలిసి ఉంటే కలిగే ఆనందం చెప్పలేనిదని... అట్టి స్నేహంలో అనంతమైన ఆత్మ సంతృప్తి దాగిఉందని...
ఆ స్నేహానుభూతిని ఒకసారి అనుభవిస్తేనే తెలుస్తుందని...
స్నేహం అంటే...
ఓ మధురమైన అనుభూతిఅని...
ప్రవిత్రమైన స్నేహం ప్రకృతి వంటిదని...
అది ఎంతో ఓదార్పునిస్తుందని...
జీవనయానంలో స్నేహం శ్వాస వంటిదని...
సృష్టిలో నా అనేవారు, బంధువులులేని వారు
ఎవరైనాఉంటారేమే గాని స్నేహితులులేని వారుండరని...
కష్టాల్లో సుఖాల్లో అండగా ఉండేవారు..
నిస్వార్థంగా సాయం అందించేవారే నిజమైనమిత్రులని
స్నేహమే జీవితమని.. స్నేహమే శాశ్వతమని...



