Facebook Twitter
ఆథ్యాత్మిక మందిరానికి అదృశ్య స్థంభాలు...4..?

ఉత్తర‌ప్రదేశ్ రాష్ట్రంలో
సరయూ నదీతీరాన...
ఎన్నో వేల ఏళ్ళ క్రితం వెలసిన 
అతి సుందరమైన అతి ప్రాచీనమైన
ఆథ్యాత్మిక నగరం అయోధ్య నగరం...

అత్యంత పవిత్ర స్థలం
ఈ శ్రీ రామజన్మభూమి ఇది
హిందువుల సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం
అయోధ్యలోని శ్రీరామమందిరంలో
స్థంభాలు 392 మనకు వేదాలు...4
చారిత్రాత్మకమైన
ఈ శ్రీ రామమందిర నిర్మాణానికి
ప్రధానమైన అదృశ్య స్థంభాలు...4

1992
డిసెంబర్ 6 న...
అద్వానీ ఆధ్వర్యంలో
బాబ్రీ మసీదు కూల్చివేత...

2019 నవంబర్ 9 న ...
ప్రధాన న్యాయమూర్తి
జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో
ఐదుగురు సభ్యుల ధర్మాసనం
ఇచ్చిన చారిత్రాత్మకమైన తీర్పు...

2020 ఆగస్టు 5 న..‌.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీచే...
శ్రీరామమందిరానికి "శంకుస్థాపన"

2022 జనవరి 22 న...
ప్రధానమంత్రి నరేంద్రమోడీచే...
ఆథ్యాత్మిక నగరం అయోధ్యలో
ప్రతిష్టాత్మకంగా బాలరాముని
విగ్రహానికి "ప్రాణప్రతిష్ట"మహోత్సవం