Facebook Twitter
ఒక శుభదినం ఒక పుణ్యదినం 2024 జనవరి 22…

నాడు మహర్షి వాల్మీకి
24000 శ్లోకాలతో
రసరమ్యంగా రచించిన
రామాయణ కావ్యంలో...

సీతమ్మ తల్లి..
ఒక మంచి ‌భార్యగా...

పాదుకలకు పట్టాభిషేకం చేసిన
భరతుడు...ఒక మంచి సహోదరుడిగా...

ఆంజనేయుడు...
ఒక మంచి నమ్మిన బంటుగా...

శ్రీరాముని ఆ దివ్యనామం...
ఒక తారకమంత్రంగా...

శ్రీ మద్రామాయణ గ్రంథం...తెలుగు
సాహిత్యంలో ఒక ఆదికావ్యంగా...

సీతమ్మ రామయ్య కొలువైన
కోవెల...ఒక దివ్యమందిరంగా...

ఆ శ్రీరామచంద్ర మూర్తి..
ప్రపంచానికే ఒక ప్రత్యక్ష దైవంగా...

నేడు అయోధ్యలో నిర్మితమైన
దివ్య భవ్య నవ్య రామమందిరంలో
భక్తులందరికీ దర్శనమిచ్చే
బాలరామునికి ప్రతిష్టాత్మకంగా గర్భగుడిలో ప్రాణప్రతిష్ట జరిగే‌వేళ...

ప్రపంచ ఆథ్యాత్మిక చరిత్రలో
సువర్ణాక్షరాలతో లిఖించిబడే...
ఒక సుందర శుభకర దినం...
ఒక మరపురాని మధుర దినం...
ఒక మంగళకర మనోహర దినం...
పరమపవిత్రమైన పుణ్యం ప్రాప్థించేదినం
అదే అదే...2024 జనవరి 22...వ తేది..