Facebook Twitter
బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట మహోత్సవం...

నేడు 24 జనవరి 22..
ఆథ్యాత్మికపురి అయోధ్యలో
శ్రీరామమందిరంలో
మధ్యాహ్నం 12.29. ని.లకు
అభిజిత్ లగ్నంలో...
84 సెకన్ల శుభఘడియల్లో...
వేదమంత్రాలతో...
మంగళవాయిద్యాలతో...
దేశమంతా..."జై శ్రీరామ్"
నినాదంతో మారుమ్రోగి పోయేవేళ...

వేదపండితులు
శ్రీ గణేశ్వర్ శాస్త్రి ద్రావిడ్
పూజాకార్యక్రమ నిర్వహణలో...
"విగ్రహ ప్రాణప్రతిష్ట" మహోత్సవం...
నభూతో న భవిష్యత్ అన్నరీతిలో
అట్టహాసంగా...
అద్భుతంగా...
అపురూపంగా...
అంగరంగ వైభవంగా...
140 మంది భారతీయుల
గుండెల్లో మరపురాని
ఒక మధురజ్ఞాపకంగా
మిగిలిపోయేలా...జరిగింది...

ఎన్నో పోరాటాలకు
వివాదాలకు నిలయమై...
500 ఏళ్ళ నాటి
సుందర స్వప్నం సాకారమై...
ఆథ్యాత్మికపురి అయోధ్యలో
ప్రతిష్టాత్మకంగా నిర్మితమైన 
దివ్య భవ్య నవ్య శ్రీరామమందిరంలో
ఒకే రాయిలో అద్భుతంగా చెక్కబడి
నేడు జనవరి 22
మధ్యాహ్నం 12.29 ని.లకు
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ గారిచే
ప్రాణ ప్రతిష్ట చేయబడిన
బాలరాముని విగ్రహంలో
వింతలు విశేషాలు ఎన్నో ఎన్నెన్నో...

నవ్యత్వం...
మహావిష్ణువు దివ్యత్వం...
5 సంవత్సరాల బాలుని
అమాయకత్వం...
చిరుమందహాసం...
ఓ రాకుమారుని రాజసం...
ఉట్టి పడేలా 51 అంగుళాలలో...

ఏక కృష్ణశిలలో చెక్కిన
బాలరాముని విగ్రహం...
ఓం......స్వస్తిక్ తో...
శంఖ....చక్రాలతో...
తలపై...సూర్యభగవానునితో...

మత్స్య...కూర్మ
వరాహ...నరసింహ
వామన...పరశురామ
శ్రీ రామ...శ్రీ కృష్ణ
బుద్ధ...‌....కల్కి వంటి
విష్ణుమూర్తి దశావతారాలతో...

ఇటు గరుడు....
అటు హనుమంతుడున్న..
ప్రత్యేక సజీవ చిహ్నాలతో...
భక్తులకు దర్శనమిచ్చేలా...
దర్శించినంత జన్మతరించేలా...
నిర్మితమైన ఆ బలరాముని
దివ్య మంగళ రూపం...
అపురూపం...అద్భుతం...అద్వితీయం.!

అందుకే...
పాదాభివందనమయ్యా...!
మీకు ఓ పట్టాభిరామయ్యా...!
జేజేలు మీకు ఓ జగదభిరామా...!
జయహో..! జయహో..! జయహో..!
కోటికోర్కెలు తీర్చేటి ఓ కోదండరామా..!