ఒకనాడు
కోసల రాజ్యానికి
రాజధాని...అయోధ్య
అతి పురాతనమైన... పుణ్యక్షేత్రం...అయోధ్య
బుద్ధుడు నడయాడిన
సాకేతపురం...అయోధ్య
తీర్థశంకరులు తిరుగాడిన
దేవతల నగరం..అయోధ్య
హిందువుల ఏడు మోక్షధామాలలో
సుప్రసిద్ధమైన నగరం...అయోధ్య...కానీ
15 వ శతాబ్దంలో బాబర్ పాలనలో
16 లో మొఘలుల పాలనలో...
17 లో తెల్లదొరల పాలనలో...
దాడులతో...దండయాత్రలతో...
దురాక్రమణలతో...77 భీకర
యుద్దాలతో దద్దరిల్లింది...అయోధ్య
18 వ శతాబ్దంలో
రామజన్మభూమిగా
ఎంతగా కీర్తించబడినా...
అయోధ్య...
గుండెల్లో ఎన్ని గునపాలో...
అయోధ్య...చుట్టూ ఎన్ని
వాదవివాదాల సుడిగుండాలో...
మందర్ మషీద్ పేర...
అయోధ్యలో ఎన్ని మతఘర్షణలో...
ఎన్ని మారణహోమాలో... కానీ
రామమందిరం నిర్మాణం కోసం
ఎల్ కే అద్వాని చేపట్టిన రథయాత్రకు...
చేసిన ఆత్మగౌరవ న్యాయ పోరాటాలకు...
సుప్రీంకోర్టిచ్చిన చారిత్రాత్మక తీర్పుకు...
ప్రతిఫలంగా...
500 ఏళ్ల కల సాకారమై...
నేడు అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా
నిర్మితమైన శ్రీరామమందిరంలోని
గర్భగుడిలో ప్రధాని నరేంద్ర మోడీచే బలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట మహోత్సవం జరుగు శుభసందర్భంగా...
"జై శ్రీ రామ్" నినాదం
దేశమంతా మారుమ్రోగే...
దిక్కులు నాలుగు పిక్కటిల్లే...
విశ్వమంతా విస్మయంచెందే...



