పరబ్రహ్మమైన.......ఆ పరమాత్మయే...
ఆ మహావిష్ణువే.....ఆ విశ్వంభరుడే...
జగతిలో జన్మించే..జగదభిరాముడై...
పరంధాముడై........పట్టాభిరాముడై...
పూర్ణపురుషుడై.....పురుషోత్తముడై...
దశరథనందనుడై...శ్రీ రామచంద్రుడై...
పరమపావని సీతామాతను
అపహరించిన రాక్షస
రావణాసురున్ని సంహరించి...
ధర్మాన్ని ప్రతిష్టించి...
పదకొండువేల సంవత్సరాలు
పుడమిని పాలించి...
ఈ మానవజాతి అంతరించువరకు...
తన దివ్యప్రభావాన్ని ప్రసరింపజేయు
ఆ తేజో మూర్తిని...
ఆ పావన మూర్తిని...
ఆ మంగళ మూర్తిని...
"జయ జయ రామ జానకి రామ"...
"కోరిన కోరికలు తీర్చే కోదండరామా"...
అంటూ... నాడు నేడు...తన్మయత్వంతో
ఆరాధించి తరించిరే...భక్తాగ్రేసరులెందరో..
తేనెపట్టులాంటి...పాలు పంచదారలాంటి
తెలుగుపదాలతో...అమృతధారల వంటి
సంస్కృత సమాసాలతో...సంకీర్తనలతో
"అంతా రామమయం"...
"ఈ జగమంతా రామమయం"...అంటూ
"రామనామస్మరణ"చేసి...ధన్యులైపోయిరే
"కావ్యాలెన్నో లిఖించి...కవిశేఖరులెందరో
శ్రీ మహావిష్ణువును
కోదండరామునిలో...
ఆ కోదండరామున్ని...
నేటి కోనేటి రాయునిలో...
దర్శించుకొని...ధన్యులైపోయిరే...
ఈ ధరణిలో...పుణ్యమూర్తులెందరో...



