Facebook Twitter
రామాయణం నిత్యపారాయణం

రామాయణం ఒక కల్పవృక్షం
రాముడు సకలగుణ సంపన్నుడు
రామనామజపం పాపశాపహరణం

శ్రీ రామచంద్రునివంటి ఆదర్శమూర్తి
సీతమ్మతల్లి లాంటి సాధ్వీమణి

వశిష్టుని వంటి విశిష్టమైన గురువు
సుమంతుని వంటి మహామంత్రి
లక్మణ భరత శత్రుఘ్నుల వంటి
వినయ సంపన్నులైన సహోదరులు

గుహుని వంటి ఉదారపురుషుడు
ఆంజనేయునివంటి నమ్మినబంటు
లంకవంటి అతిసుందరమైననగరం
వాల్మీకి మహర్షివంటి ప్రాచీనకవి

రామాయణం వంటి అపురూపమైన
అద్భుతమైన ఆదికావ్యం
ఈ భువిలో లేదు లేదు లేదు
కంటికి కానరాదు‌ రాదు రాదు

సకలధర్మాలకు సకలసుగుణాలకు
ఆలవాలమైన రామాయణగ్రంథంతో
బాటుగా మహాభారత భాగవత
భగవద్గీత బైబిల్ ఖురాన్ వంటి

ఆథ్యాత్మిక బృహత్ గ్రంథాలనుసైతం
నిత్యం పారాయణం చేసిన వారికి
సకల సౌఖ్యాలు సుఖశాంతులు
భోగభాగ్యాలు నిండుగా లభిస్తాయి
సందేహం వలదు పరమసత్యమిది