మన ఆరాధ్య దైవం
శ్రీ రామచంద్రుడంటే
రఘువంశ రాజకుమారుడు
క్రమశిక్షణ గలవాడు
ధనుర్విద్యలో ఆరితేరినవాడు
ఒకే మాట ఒకే బాణం
ఒకే భార్యగల ఏకపత్నీ వ్రతుడు
సకల గుణసంపన్నుడు
ప్రశాంత చిత్తం గలవాడు
సాహసికుడు సమర్థుడు
సత్యవాక్య పరిపాలకుడు
నిత్యంసత్యాన్ని పలికేవాడు
నీతిమంతుడు దూరదృష్టి
దృఢమైన సంకల్పం కలిగిన
ధర్మాత్ముడు ధైర్యవంతుడు
సమస్త కార్యాలలోను సమర్ధుడు
సర్వజీవుల పట్ల దయకలిగినవాడు
సకల ప్రాణుల శ్రేయస్సును కోరువాడు
ఘనచరిత్రగల ఘనుడు త్యాగధనుడు
దయ జాలి ప్రేమగల దశరధ నందనుడు
కోటిసూర్యులతేజస్సు కలిగినవాడు
ఎదుటివారిలో మంచినే చూసేవాడు
సమస్తలోకాల్లోనూ సాటిలేని వీరుడు
సమస్యలను చిరునవ్వుతో స్వీకరించే
సుందరరూపుడు ఈ అందాలరాముడు
ఆందోళనచెందని స్థితప్రజ్ఞుడు అసూయ
ఆవేశ మెరుగని ఈ అయోధ్య రాముడు
దేవతలకు కూడా భయాన్ని కలిగించే ధీశాలి
రాక్షసుడైన రావణాసురున్ని సంహరించినవాడు
క్రోధాన్ని కోపాన్ని ఇంద్రియాలను జయించినవాడు
అట్టి పురుషోత్తమున్ని మన పాలకులంతా
ఆదర్శంగా తీసుకుంటే వచ్చేది రామరాజ్యమే కాదా!
ప్రజాస్వామ్యంలోప్రజలంతా సుఖశాంతులతో జీవించరా?
ధర్మం ధరణిలో దద్దరిల్లదా? ప్రగతి దేశాన ప్రజ్వరిల్లదా?



