సీతాపతిని పూజించే
...చేతులే చేతులు
శ్రీ రామనామాన్ని కీర్తించే
...నాలుకే నాలుక
నీలమేఘశ్యామున్ని దర్శించే
...చూపులే చూపులు
శ్రీరామచంద్రునిపాదపద్మాలకు మొక్కే
...శిరస్సే శిరస్సు.
శ్రీ సీతారాముల సుచరితం ఆలకించు
...చెవులే చెవులు.
శ్రీమహావిష్ణువు అవతారునిపై లగ్నమయ్యే
...మనస్సే మనస్సు
శ్రీ రామమందిరంచుట్టూ ప్రదక్షిణలు చేసే
...అడుగులే అడుగులు
అయోధ్య రామునిపై లగ్నమయ్యే
...బుద్ధియే సద్బుద్ధి
శ్రీ సీతారాముల కళ్యాణం జరిగిన
...దినమే శుభదినము
వీనుల విందైన శ్రీ మద్రామాయణ గ్రంథ
...పఠనమే పఠనము
ఇరవై నాలుగు వేల శ్లోకాలతాత్పర్యాలను చెప్పే
...గురువే సద్గురువు.
తడబడినడిచేనాడే రామకథను వినిపించు
...తండ్రే మంచి తండ్రి.
ఏకపత్నీవ్రతుడైన శ్రీరామునికి అంకితంమిచ్చిన
...గ్రంథమే సద్గ్రంథము. అందుకే
అన్యోన్య దాంపత్యానికి ఆదిదంపతులైన
ఆ జానకి సహనము ఆ రాముని సుగుణము
ఏ యుగమైనను నిలచే ఆదర్శమంటూ
వారి దారిలోన నడుచు వారి జన్మధన్యమంటూ
నాటి సినీకవి ఇచ్చిన సందేశం సదా సంస్మరణీయము



