జనవరి 22 న అయోధ్యలో...
బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట
వేడుకకు స్వాగతం..!ఘనస్వాగతం..!
ఆథ్యాత్మిక నగరం
అయోధ్యాపురిలో
అంగరంగ వైభవంగా
ప్రతిష్టాత్మకంగా జరిగే
బాలరాముని విగ్రహ
ప్రాణప్రతిష్ట మహోత్సవం...
తిలకించి పులకించి పోయే
7000 మంది అతిథులకు సెలబ్రిటీలకు
రామభక్తులకు స్వాగతం..! సుస్వాగతం!
రండిరండి..!రామదండులా కదలిరండి..!
నాడు కోసలరాజైన దశరథుడు
ముద్దుల భార్యలు ముగ్గురున్నా
తన వారసుడు లేక విలవిలలాడే...
పుత్రసంతానానికై పాపం పరితపించే...
వశిష్ట మహర్షి సలహామేర
పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహించే...
అగ్నిదేవుడు ప్రసన్నుడై పాయసపాత్రను
అందించి దశరథుడికి అదృశ్యమాయే...
త్రాగిపాయసం భార్యలు గర్భవతులాయే
త్రేతాయుగంలో.......వసంత రుతువులో...
చైత్ర మాసంలో........శుద్ధ నవమినాడు...
గురువారం రోజు......పునర్వసు నక్షత్రంలో
కర్కాటక లగ్నంలో...అభిజిత్ముహూర్తంలో
మధ్యాహ్మం 12.05 ని.లకు...
రావణ సంహారార్థం...
కౌసల్య గర్భఫలంగా...
ధరణిలో ధర్మ సంస్థాపనార్థం...
దశరధుని పుణ్యఫలంగా...సాక్షాత్తుగా...
ఆ శ్రీమహావిష్ణువే ఏడో అవతారంగా...
నాడు క్రీ.పూ 5114 జనవరి 10వ తేదీన
జగదభిరాముడై...అయోధ్యలో జన్మించే...
నేడా బాలరామునికి అయోధ్యలో
సుందర మందిరం నిర్మాణమాయే...
2024 జనవరి 22న మధ్యాహ్నం
12.20 ని.లకు మైసూర్ శిల్పి
అరుణ్ యోగిరాజ్ చే కృష్ణశిలపై చెక్కబడిన బాలరామునికి
ప్రధానమంత్రి నరేంద్ర మోడీచే
జరిగే "ప్రాణప్రతిష్ట" మహోత్సవం
తిలకించి పులకించి పోయేందుకు
ప్రపంచమే ఆశతో ఎదురు చూసే వేళ ఆసన్నమాయే...అందుకే భక్తులారా..!
రండిరండి..!రామదండులా కదలిరండి..!



