Facebook Twitter
గురువులు...గుణపాఠాలు..?

పాఠాలు...
నేర్పేవారంతా 
మనకు గురువులేనని...

కాలం ఒక గురువని...
ప్రకృతి ఒక గురువని...
ఆత్మ ఒక గురువని...
అంతరంగం ఒక గురువని...

దేహం ఒక గురువని...
దేహం గుహలో దాగిన అవయవాలన్నీ 
గుణపాఠాలు నేర్పే గొప్ప గురువులని...

పెదవులు రెండూ
కలిస్తేనే ముద్దు ముచ్చట్లని...
చేతుల రెండు కలిస్తేనే చప్పట్లని...
కళ్ళురెండైనా చూపు ఒక్కటేనని...
కాళ్లు రెండైనా గమ్యం ఒక్కటేనని...

ఇట్టి ఇంద్రియాల సందేశమే
భార్యా భర్తలకు భగవద్గీత...
దీని సంసార సందేశ సారమొక్కటే...

భార్యా భర్తలిద్దరు
ఒకరికొకరు ఆ భగవంతుడు 
ప్రసాధించిన బంగారు బహుమతులని...
చూపులకిద్దరైన వారు అర్థనారీశ్వరులని...