ఓ దయగల దైవమా..!
ఈ కొత్త సంవత్సరంలో
మా మొర ఆలకించుమా..!
పగబట్టిన
ఆ విధి కొట్టిన
కొరడా దెబ్బలకు
గతవత్సరమంతా
మా జీవితమంతా
గాయాలమయమే...
అందుకే ఓ దైవమా..!
ఈ నూతన సంవత్సరంలోనైనా
మా కలలను
కల్లలుచేయని...నెలలను
మమ్మల్ని మానసిక వ్యధలకు
గురిచేయని.....మాసాలను
వాదాలు వికృత
విభేదాలులేని....వారాలను
గండాలు సుడి
గుండాలులేని....గంటలను
ఏ కష్టాలు ఏ కన్నీళ్లులేని
ఏ రోగాలురాని.....రోజులను
నిప్పులా కాల్చే నిరాశ
నిట్టూర్పులులేని...నిమిషాలను
ప్రశాంతతే తప్ప...పెను
ప్రమాదాలు దరిజేరని...క్షణాలను
మచ్చలేని
చందమామలాంటి...
స్వచ్ఛమైన
అమ్మ పాలలాంటి...
మల్లెలా.......తెల్లనైన
మంచులా...చల్లనైన
తేనెలా........తీయ్యనైన
చెట్టులా......పచ్చనైన
ఆనందం ఆరోగ్యం
సుఖము శాంతి పొంగి
పొర్లే ఒక నూతన
ప్రేమ సంవత్సరాన్ని
మాకు ప్రసాదించమని...
కొండంత ఆశతో అర్థిస్తున్నాం...
పేరాశతో ప్రార్థిస్తున్నాం తండ్రీ..!



