సుసంపన్నమైన కోసల దేశానికి రాజు...
కౌసల్య, సుమిత్ర, కైకేయి యను
ముగ్గురు భార్యల ముద్దుల మొగుడు...
ధర్మపరాయణుడైన దశరథ మహారాజు...
సంతాన భాగ్యం లేక చింతాక్రాంతుడాయె
వశిష్ట మహర్షి సలహామేర పుత్రకామేష్టి యాగం చేయగా...అగ్నిదేవుడు ప్రత్యక్షమై...
దశరథుడికి పాయసపాత్ర నిచ్చినందుకు...
నాడు ఆనందతాండవం చేసింది అయోధ్య
ఆ పాయసాన్ని సేవించిన ముగ్గురు భార్యలు గర్భం దాల్చగా త్రేతాయుగంలో...
వసంత రుతువులో...చైత్రశుద్ధ నవమి నాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నవేళ...
క్రీ.పూ 5114 జనవరి 10 గురువారం రోజు
పునర్వసు నక్షత్రంలో...కర్కాటక లగ్నంలో...
అభిజిత్ ముహూర్తంలో...మధ్యాహ్మం 12 గంటలకు దుష్టశిక్షణ...శిష్టరక్షణ కోసం...
లంకాధిపతి రావణ సంహారం కోసం...
మానవరూపంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే కౌసల్య దశరధుల పుణ్య గర్భమందు
శ్రీరామచంద్రునిగా అవతరించగా...నాడు
తిలకించి పులకించి పోయింది...అయోధ్య
నేడు 32 సంవత్సరాల కల నెరవేరి
161 అడుగుల ఎత్తులో...
380 అడుగుల పొడవుతో...
250 అడుగుల వెడల్పుతో...
392 స్థంభాలతో...
44 ద్వారాలతో...
5 మండపాలతో...
4 దిక్కుల నాలుగు దేవాలయాలతో...
3 అంతస్తుల్లో...
70 ఎకరాలలో...
నాగర్ శైలిలో...
ఇసుమంతైనా ఇనుము లేకుండా...
ప్రతిష్టాత్మకంగా నిర్మితమైన
రామమందిరంలో...
ప్రధాని మోడీ అమృతహస్తాల మీదుగా
22 జనవరి న
51 అడుగుల"బాలరాముని
ప్రాణప్రతిష్ట" జరగబోతున్నందుకు
అయోధ్య నగరం ఆనందసాగరమై అలరారే



