ఓ మిత్రమా..!
నా ప్రియ నేస్తమా..!
తీర్చవా ఈ ధర్మ సందేహం...?
ఆ దేవుడు
కనిపించకున్నా
కరుణ కురిపించే
కరుణామయుడైతే...
భార్యా భర్తలిద్దరికీ
ఒకేరోజు పంపవచ్చును కదా
"అమరత్వానికి ఆహ్వానం"...?
మిత్రుడి...వివరణ...!
ఔను అది ఈ పిచ్చిమనిషి
ఆశ అమాయకత్వంఅజ్ఞానమే
ఆ కోరిక కోరితే భగవంతుడు
కొరడాలతో కొట్టవచ్చు
మనిషి వెర్రితనానికి
విరగబడి నవ్వవచ్చు
కారణం ఇక్కడో తిరకాసుంది
ఇద్దరూ ఒకేసారి
ప్రయాణంమైపోతే వారికి
ఆత్మలు శాంతింపజేసే
అంతిమసంస్కారాలు
కర్మకాండలు నిర్వహించేదెవరు...?
అసలు
ఒకరి విలువ...
వారి గొప్పతనం...
వారి మంచితనం...
వారి సేవా గుణం...
మచ్చలేని వ్యక్తిత్వం...
ఒకరిమీద ఒకరికి
వారిలో దాగిఉన్న అంతులేని
ఆ ప్రేమతత్వం...తెలిసేదెప్పుడు..?
వారు ఒకరి కంటే
ఒకరు ముందు పోతేనే కాదా...!
ఔను మిత్రమా..!
ఇది కాబోలు ప్రకృతి ధర్మం..!
ఇది కాబోలు సృష్టి మర్మం...!
ఇందుకే కాబోలు ఆపరమాత్మ
ఒకరి తర్వాత ఒకర్ని పిలిచేది..!
తనలో ఐక్యం చేసుకునేది.......!
ఔను ఇది కదా మనిషికి ఎంతకూ అంతుచిక్కని ఓ వింత రహస్యం..!



