Facebook Twitter
ఏమన్నది ఏమన్నది ? త్రివర్ణ పతాకం !...(2)

ఏమన్నది ఏమన్నది ?
నా త్రివర్ణ పతాకం !..
మన మహాత్ములు
మహనీయులు ఋషులు
మహర్షులు అందించిన
ఆ నాలుగు వేదాలే రథాలై
నా బంగారుతల్లి భర్తమాతను ఊరేగిస్తాయన్నది

ఏమన్నది ఏమన్నది ?
నా త్రివర్ణ పతాకం !..
ఎండిన పంటపొలాలను
సస్యశ్యామలం చేసే ఆ
గంగాయమున బ్రహ్మపుత్రలే
మనకు జీవనధారలన్నది

ఏమన్నది ఏమన్నది ?
నా త్రివర్ణ పతాకం !..
ఆరనిజ్యోతులు...అమరవీరులైన...
భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్
అల్లూరి సీతారామరాజుల
నిస్వార్థపు త్యాగాలే మనకు నవజీవనరాగాలన్నది

ఏమన్నది ఏమన్నది ?
నా  త్రివర్ణ పతాకం !
ఘనులు...త్యాగధనులైన...
గాంధీ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్
ఇందిరా రాజీవ్ అటల్ బిహారీ వాజపేయి
అబ్దుల్ కలాం జాతినేతల ఆశయాలే మనకు ఆదర్శమన్నది