ఏమన్నది ? ఏమన్నది ? నా మువ్వన్నెల జెండా !...(3)
అదిగో...అదిగో...అల్లదిగో..
ఆ నీలినీలి ఆశల ఆకాశంలో
రెపరెపలాడుతూ...ఎగురుతోంది
ఎగురుతోంది...నా మువ్వన్నెలజెండా
ఏమన్నది ఏమన్నది ?
నా మువ్వన్నెల జెండా !
నీతిగా...నిజాయితీగా.....జీవించమన్నది
నిస్వార్థంగా...నిప్పులా
.....బ్రతకమన్నది...
నిశ్చింతగా
.....నిద్రపొమ్మన్నది
నిర్భయంగా
.....తలఎత్తుకు తిరగమన్నది.
ఏమన్నది ఏమన్నది ?
మువ్వన్నెల జెండా !
పచ్చని చెట్టులా.....పెరగమన్నది
ఎవరెస్టు శిఖరంలా
.....ఎదగమన్నది
నింగిలో తారల్లా
.....మెరవాలన్నది
నీటిలో కలువల్లా
.....వికసించాలన్నది
సూర్యాచంద్రుల్లా
.....ప్రకాశించాలన్నది
ఏమన్నది ఏమన్నది ?
నా ముత్యాల మురిపాల
మువ్వన్నెల జాతీయ జెండా !
కమ్మని కలలు.....కనమన్నది
కన్న ఆ కలలు
సాకారమయ్యేంతవరకు
.....కునుకు తియ్యకన్నద



