అదిగో...అదిగో...అల్లదిగో
ఆ నీలినీలి ఆశల ఆకాశంలో
రెపరెపలాడుతూ...విహంగంలా...
స్వేచ్ఛగా...ఎగురుతోంది...
ఎగురుతోంది...నా మువ్వన్నెల జెండా !
అదిగో... అదిగో...అల్లదిగో...
కోటిప్రభల సూర్యబింబంలా.....
వెలిగే నా మువ్వన్నెలజెండా !
ఏమన్నది ? ఏమన్నది ?
ఎందరో నిస్వార్థపరుల,
మహానుభావుల మహాత్ముల,
స్వాతంత్ర్య సమరయోధుల
జాతినేతల, జైలు జీవితాల, రక్తతర్పణాలకు
ప్రతిఫలమే...మన అర్థరాత్రి స్వాతంత్ర్యమన్నది
అదిగో....అదిగో...అల్లగదిగో...
నింగిలో శాంతి కపోతంలా .....
ఎగిరే నా మువ్వన్నెల జెండా !
ఏమన్నది ? ఏమన్నది ?
కులాలకు,
జాతులకు
సర్వమతాలకు
వర్ణాలకు, వర్గాలకు, సంస్కృతీసంప్రదాయాలకు
నా భరతజాతి...నిలయమన్నది
భిన్నత్వంలో ఏకత్వమే మన నినాదమన్నది
అదిగో...అదిగో...అల్లగదిగో...
ఏడురంగుల ఇంద్రధనస్సులా.....
మెరిసే నా మువ్వన్నెల జెండా !
ఏమన్నది ? ఏమన్నది ?
ప్రజాస్వామ్యమే...
మనకు ఆరవప్రాణమన్నది
అదే మన భరతమాతకు...
స్వర్ణాభరణమన్నది
అంబేద్కర్ రాజ్యాంగమే...
మనకు రక్షణ కవచమన్నది



