నిజమైన దేశభక్తి...(3)
దేశమును ప్రేమించుమన్నా
మంచియన్నది పెంచుమన్నా
దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్ అన్న
గురజాడ అప్పారావు అమృతవాక్కుల్ని...
మంచి చేయకపోయినా చెడు చేయకన్న
స్వామి వివేకానందుని విశ్వ సందేశాన్ని....
ఓ రామనామ జపంలా
నిత్యం స్మరించినంతకాలం
మీలో సమతా.....మమతా
జాతీయత..........ఆత్మీయత
మంచితనం.........మానవత్వం
సమానత్వం........సౌభ్రాతృత్వం
నిజమైన దేశభక్తి...
నిండుగా ప్రవహిస్తున్నట్లే లెక్క



