ఏది నిజమైన దేశభక్తి...?...( 2 )
భరతమాత
దాస్యశృంఖలాలను
త్రెంచేందుకు
పిడికిళ్ళు బిగించిన
ఉప్పెనలై ఉరికిన
ఉవ్వెత్తున
సముద్రకెరటాలై ఎగిసిపడిన
ఉద్యమాలతో
ఉక్కిరిబిక్కిరి చేసిన
అహంకారంతో అధికారదాహంతో
విర్రవీగుతూ విభజించి పాలించే
ఆంగ్లేయులను ఎదిరించిన
వారి గుండెల్లో నిదురించిన
నిరసనలతో నిప్పులు కురిపించిన
స్వరాజ్య కాంక్షతో
దేశభక్తితో రగిలిపోయిన
దేశానికే సర్వం త్యాగం చేసిన
ఘనులు...త్యాగధనులైన
ఆ స్వాతంత్ర్య సమరయోధుల
స్మరణే నిత్యం ఒక ప్రేరణగా
వారి అడుగుల్లో అడుగులు వేస్తూ
వారి ఆశయాలకు అంకితమైతే చాలు
మీలో నిజమైన దేశభక్తి...నిండుగా ప్రవహిస్తున్నట్లే



