పరమాత్మ - ప్రకృతి - మనం
మనం
దేన్నయితే చూస్తామో
దాన్ని మనసుకు నచ్చితే
ఇష్టపడతాం
దేన్నయితే ఇష్టపడతామో
దాన్ని ప్రేమిస్తాం
దేన్నయితే ప్రేమిస్తామో
దాన్ని గౌరవిస్తాం
దేన్నయితే గౌరవిస్తామో
దాన్ని పూజిస్తాం
దేన్నయితే పూజిస్తామో
దానికోసం ప్రాణమివ్వడానికైనా సిద్దపడతాం
ఇదే ప్రకృతి ధర్మం
ఇది ఆ పరమాత్మ
మనకు అందించిన వరం
కాని
ఆ ప్రకృతికి ప్రతికూలంగా
ఎవరు వ్యవహరించినా
వారు పాతాళానికే(నరకానికే)
ఆ పరమాత్మకు
అకూలంగా ఎవరు జీవించినా
వారు పరలోకానికే (స్వర్గానికే)
ఈపూట ఈ నామాట
వింటారు కదూ...
కలనైనా మరువకుండా
వుంటారు కదూ....



