దేముడనే వాడు వున్నాడా?
ఉన్నా డున్నా డున్నాడు
దేవుడనే వాడున్నాడు
ఇక్కడ అక్కడ ఎక్కడపడితె
అక్కడనే వాడున్నాడు!
గుడిలో రాతిలొ వున్నాడా?
బడిలో చదువుతు వున్నాడ?
వడిలో పెరుగుతు వున్నాడా?
మదిలోమెదలుతువునన్నాడ?
సూర్య చంద్రులలో వున్నాడు
చుక్కలలోను వున్నాడు
అణువు అణువునా తానే వుండి
ఆకాశ మంతా నిండున్నాడు!
విరిసే పూలలో వున్నాడు
కురిసే వానలో వున్నాడు
పండే పంటలొ వున్నాడు
పచ్చదనములో వున్నాడు!
గుడిలో బడిలో వొడిలో లేడు
మనిషి మనిషిలో దీపం లాగ
మిణుకు మిణుకు మంటున్నాడు
ఆరనీకు ఆ దీపాన్ని
అందించుమ వెలుగందరికి!



