నిన్న ఒక శిల్పకళాకారుడు
పగలురేయి శ్రమించి
స్వేదం చిందించి
చెక్కిన ఓ సుందరశిల్పం
నేడు గర్భగుడిలో భక్తులచే
అర్చనలు అభిషేకాలు అందుకుంటుంది
ఉత్సవాలపేరుతో ఊరంతా ఊరేగుతుంది
కాని ఆ శిల్ప కళాకారుడు మాత్రం
ఆస్తిపాస్తులేవీ ఆర్జించని అమాయకుడు
భార్యాబిడ్డలను పోషించలేని అసమర్థుడు
కాని ఆ శిల్ప కళాకారుడు మాత్రం
చిమ్మచీకటిలో పూరిగుడిసెలో
ఆకలితో అలమటిస్తున్న ఓ అస్థిపంజరం
కాని ఆ శిల్ప కళాకారుడు మాత్రం
జీవితంలో చిక్కులు చింతలు చీకాకులే తప్ప
వెలుగన్నది అసలు ఎరుగనివాడు ఎదగనివాడు
కాని ఆ శిల్ప కళాకారుడు మాత్రం
సుఖసంతోషాల రుచి తెలియనివాడు నేడు
గుడిముందర ఓ బిక్షగాడిలా పడివున్నాడు
ఐతే ఆ శిల్ప కళాకారుడు మాత్రం
నిన్న శిలను,ఉలిని,సుత్తిని
స్వశక్తిని నమ్ముకున్నాడు
నేడు భగవంతుని బొమ్మల్ని
అంగడిలో అమ్ముకుంటున్నాడు
కానీసందేహామొక్కటే ఏ శిల్పకళాకారుడైనా
శ్రమపడి శిలను ఉలితో చెక్కగలడేనే
కాని,ఆ శిలకింత ఊపిరి పొయ్యలేడు
అసలా శిలను చెక్కడానికి,
సుందర శిల్పంగా మార్చడానికి,
సుత్తితో ఎన్ని దెబ్బలు కొడతాడో
అన్ని కష్టాలు జీవితంలో అనుభవిస్తాడో ఏమో,
పాపం అదే ఆ శిల్పికి శాపం కావచ్చు



