మా ప్రార్థనొక్కటే...
ఓ దేవుళ్ళారా !
దేవతలారా !!
ఎక్కడున్నారు ?
మీరెక్కడున్నారు?
తమ ప్రాణాలనే
ఫణంగా పెట్టి,
నిద్రాహారాలు మాని,
నిత్యం శ్రమిస్తున్న,
నిస్వార్థంతో
సేవలు అందిస్తున్న
ఆ యముడితో
భీకరపోరాటం చేస్తున్న
మా డాక్టర్లే మా నర్సులే
మా రక్షకభటులే
మా పారిశుద్ధ్య కార్మికులే
కరోనా రోగుల పాలిట
కనిపించే దేవుళ్ళు,
మీ ముక్కోటి దేవతలకు
మా ప్రార్థనొక్కటే
ఈ కరోనా రక్కసి
కోరలకు చిక్కకుండా
ప్రతిఒక్కరిని రక్షించమని,
కరుణించమని,కాపాడమని.



