Facebook Twitter
గర్భగుడిలో జ్ఞానోదయం

బద్దకస్తులందరూ బుద్దిహీనులని
తమకు తామే బద్దశతృవులని
దీర్ఘాయుష్షుకు మూలం ఆరోగ్యమేనని
అజ్ఞానులందరూ ఆసుపత్రులపాలేనని

వీచే ఆ చల్లనిగాలి, ఆ పచ్చని వృక్షాలు
ఆహ్లాదకరమైన ఆ చక్కని వాతావరణం
ఆ సూర్యోదయం ఆ నిర్మలమైన నీరెండ
మానవాళి రుగ్మతలకు దివ్యఔషధాలని, యోగా
గురువులు టీవీల్లో ఘోషిస్తున్నా...ఖాతరుచేయక

బద్దకస్తులిద్దరు గుడికెళ్ళారు కొబ్బరికాయలు కొట్టారు
గుడిచుట్టూ 108 ప్రదక్షిణలు చేసి దక్షిణ హుండీలో వేసి
ముఖిలితహస్తాలతో ఆ దైవాన్ని దీనంగా వేడుకున్నారు

ఆదాయం - ఆనందం - ఆరోగ్యం - దీర్ఘాయుష్షు
అను నాలుగు వరాలను ప్రసాదించు స్వామీఅని వారు
చేసిన ప్రార్థన ఫలించి ఓ దివ్యవాణి వారికి వినిపించింది

ఆ నాలుగు వరాలు పొందాలంటే నిత్యం మీరు
క్రమశిక్షణతో నాలుగు కర్మలు నిర్వహించాలని
అవే... వాకింగ్ - జాగింగ్ - వ్యాయామం - యోగా
అంతే ఆ గర్భగుడిలోనే వారికి జ్ఞానోదయమైంది
ఆ నాలుగువరాలకు ఈ నాలుగుకర్మలే సోపానాలని