ఉగాది...షడ్రుచుల జీవితం
మన జీవితం...
షడ్రుచుల ఉగాది పచ్చడి
ఆ ఆరురుచుల్లోనే వుంది
అనంత జీవితపరమార్థం
ఉప్పుంటే...
ఉత్సాహాన్ని
ఉల్లాసాన్ని ఊపును
ఊపిరి నిచ్చే దివ్య ఔషధం
చేదంటే...
వేపపువ్వులా
వ్యధలు వేదనలు
కలగలిసిన అనుభవం
తీపంటే...
బెల్లమంటి ఆనందం
తేనెవంటి సంతోషం సంబరం
పులుపంటే...
చింతపండువంటి
నేర్పుఓర్పుతో వ్యవహరించే
చిత్రవిచిత్రమైన పరిస్థితులు
వగరంటే...
పచ్చి మామిడిముక్కలంటి
కొత్త సవాళ్ల కోటిసమస్యల సమాహారం
కారమంటే...
కోపం పగ ప్రతీకారం తీర్చుకునే వినోద
విషాద అనుకూల ప్రతికూలతల సమ్మిళితం



