Facebook Twitter
దైవ కృప....

జీవితంలో కావాలి
ఒక లక్ష్యం... ఒక గమ్యం
దాన్ని చేరుకోవడానికి కావాలి
స్వయంకృషితో ఒక‌‌ నిర్దిష్టమైన ప్రణాళిక

అద్దెఇంటి అద్దెచెల్లించలేని స్థితినుండి
పదిమందికి ఇల్లుఅద్దెలకిచ్చే స్థితికిచేరాలంటే
ఆశించే దశనుండి శాసించే దశకు చేరినట్లే

చేసిన అప్పులు తీర్చలేక తప్పించుకు తిరిగే స్థితినుండి
అందరికి అవసరాలకు అప్పులిచ్చిఆదుకునేస్థితికి రావాలి
ధనలక్ష్మి ఇంటికి కన్నం‌వేయాలి లేదా ఇంటబందీని చేయాలి

పుచ్చుకునే స్థితి నుండి
ఇచ్చి దానధర్మాలు ఇచ్చే
ఆపదలో ఉన్నవారిని ఆదుకునే స్థితికి రావాలని
ఈ సమాజం ‌నాకేమి చేసింది
జన్మనిచ్చిన ఈ నేల నాకేమిచ్చిందనే స్థితినుండి
నేనేమీ ‌చేశాను నేనేమిచ్చాను అనే స్థితికి రావాలి

ఆశించే స్థితి నుండి  శాసించే స్థితికి చేరుకోవాలని
ప్రతి మనిషి కోరుకుంటాడు కాని కోరుకోగానే సరిపోదు

అవి సాధించాలంటే పకడ్బందీ ప్రణాళిక,
గట్టి కృషి, కసి పట్టుదల,నిరంతర శ్రమవుండాలి
స్వశక్తితో పాటు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం
శ్రేయోభిలాషుల సహకారంతో పాటు
ఆ పరమాత్మ దీవెనలు అదృశ్య హస్తం
అన్నింటికి మించి "ఆ దైవకృప" తప్పనిసరి