Facebook Twitter
అమ్మాయిలూ జరా జాగ్రత్త ! (మినీ కవిత)

రెక్కలు వచ్చిన ఏ పక్షి ఎగరక మానదు
ఎగిరి...
ఆకాశంలో హాయిగా తిరగక మానదు
తిరిగి...
తీయని మత్తుగింజల్ని తినక మానదు
తిని...
నక్కినక్కి వేటగాడు
విసిరిన వలలో చిక్కక మానదు
చిక్కి...
గిలగిల కొట్టుకోక మానదు... గింజుకోక మానదు

పాలవయసు పొంగే పడుచుపిల్ల హాయిగా
రంగులలోకంలో విహంగమై విహరించక మానదు
విహరిస్తూ....
పగటి కలలు కనకమానదు
కంటూ....
ఇంటర్నెట్లో ఇరుక్కోక మానదు
ఇరుక్కుని‌...
చాటింగ్ అంటూ చీటింగ్ చేసేమాయలోడి
మాటలు నమ్మి ప్రేమలోయలో పడకతప్పదు
పడి.....
విలవిలలాడిపోక తప్పదు...విలపించక తప్పదు

ఔను పక్షిపిల్లైనా పడుచుపిల్లైనా స్వేచ్ఛనిస్తే
రెచ్చిపోయి  బాయ్ ఫ్రెండ్సుతో  పిచ్చిపిచ్చిగా బరితెగించి
బజారులో తిరిగితే బ్రతుకు "చితికి" పోక తప్పదు

అందుకే ఓ అమ్మాయిలారా జరా ! జాగ్రత్త.........
ఓ తల్లిదండ్రులారా ! మీరు తస్మాత్ జాగ్రత్త.........