కొందరు పుణ్య స్త్రీలు
ఎన్నో నోములునోచి
శ్రీ రాముడి లాంటి
భర్తలను పొందుతారు
కొందరు తల్లులు
ఎన్నో పూజలుచేసి
పులులవంటి పుత్రులను కంటే
మూడు ముళ్ళుపడగానే
కొందరు గడుచు కోడళ్ళు
ఆ పులిపిల్లలను పిల్లులుగా
మార్చేస్తున్నారు
కొంగున ముడేసుకొని
కోతుల్లా ఆడిస్తున్నారు
ఔను కొందరు మగవారు
పెళ్ళికి ముందు వసపిట్టలు
కానీపెళ్ళి తరువాత
మాటలు రాని మూగజీవాలు
ఔను కొందరు మగవారు
పెళ్ళికి ముందు
పేలే మరఫిరంగులు
కానీపెళ్ళి తరువాత
తుస్సుమనే తారాజువ్వలు
ఔను కొందరు మగవారు
పెళ్ళికి ముందు
కస్సుబుస్సుమనే కోడెత్రాచులు
కానీ పెళ్ళి తరువాత
కోరలు పీకిన కోడెనాగులు
ఔను కొందరు మగవారు
పెళ్ళికి ముందు
ఎదురులేని మదపుటేనుగలు
కానీ పెళ్ళి తరువాత
ప్రాణమున్న పిచ్చిపీనుగలు
కొందరి పుట్టుక ఘనమే
పెళ్ళికి ముందు జన్మధన్యమే
తరువాతే జాతకాలన్నీ తారుమారు
మరివారు మగువలా? మంత్రగత్తెలా?
అది మహిళా మాయాజాలమా?
మగవారి గ్రహచారమా ?
తలవ్రాతలు వ్రాసే ఆ సృష్టికర్త జగన్నాటకమా?
అదెంతకూ అంతుచిక్కని ఓ చిదంబర రహస్యమే



