Facebook Twitter
దైవసన్నిధిలో

కలలో మనం దైవాన్ని
దైవమందిరాన్ని
తిలకిస్తే చాలు
పులకించిపోతాం
పరమానందముతో
పరవశించిపోతాం, కానీ
మెలుకువ రాగానే,
కళ్ళు తెరవగానే
ఆ కమ్మనికల కరగగానే
మనసు బాధతో, కాసేపు
విలవిలలాడిపోతుంది

పగటిపూట మనం
పవిత్ర దేవాలయాన్ని
దర్శించినట్లుగా
గుడిలో పూజలు
నిర్వహించినట్లుగా
ఊహించుకోగానే మనసు
ఉప్పొంగిపోతుంది

నిజంగా మనం‌ ఆ దైవాన్ని
దర్శించుకోలేకపోయినా
ప్రశాంతమైన
ఆ దైవసన్నిధిని దర్శించి
దాని చుట్టూ 108
ప్రదక్షిణలు చేసి కొంచెం సేపు
అందులో కూర్చొని సేదతీరే
భాగ్యం కలిగినా చాలునుకదా
బ్రతుకు ధన్యమై పోవునుగదా