Facebook Twitter
ఏమన్నది నా అర్థరాత్రి స్వాతంత్ర్యం ?

ఏమన్నది ఏమన్నది? నా మువ్వన్నెలజెండా
ఎందరో నిస్వార్థపరుల  మహానుభావుల
మహాత్ముల స్వాతంత్ర్య సమరయోధుల
జాతినేతల జైలుజీవితాల రక్తతర్పణాల
ప్రతిఫలమే మన అర్థరాత్రి స్వాతంత్ర్యమన్నది

ఏమన్నది ఏమన్నది? నా అర్థరాత్రి స్వాతంత్ర్యం?
సమైక్యతకు సమగ్రతకు నాదేశం సోపానమన్నది
భిన్నత్వంలో ఏకత్వమే మనజాతి నినాదమన్నది
సర్వమతాలకు, కులాలకు,జాతులకు,సంస్కృతి
సంప్రదాయాలకు నా భారతజాతి నిలయమన్నది

ఏమన్నది ఏమన్నది? నా తల్లి భరతమాత
మహనీయుల మహర్షుల నాలుగు వేదాలే
ధర్మాన్ని నాలుగు పాదాలపై నడిపిస్తాయన్నది
ఎండిన పంటపొలాలను సస్యశ్యామలం చేసే
గంగా యమున బ్రహ్మపుత్రలే నా జీవనాడులన్నది

ఏమన్నది ఏమన్నది? నా అర్థరాత్రి స్వాతంత్ర్యం ?
అంబేద్కర్ రాజ్యాంగమే మనకు రక్షణకవచమన్నది
ప్రజాస్వామ్యమే మనప్రభుత్వానికి ఆరవప్రాణమన్నది
అదే తల్లిభరతమాతకు స్వర్ణాభరణమన్నది,నీతిగా
నిజాయితీగా నిర్భయంగా తలెత్తుకు తిరగమన్నద