Facebook Twitter
అందాలు ఆరబోసే బంగారు బొమ్మా!

నైతిక విలువలు
పతనమైపోతున్న
మరుగుజ్జుగా మారిపోతున్న
మానవత్వాన్ని మరిచిపోతున్న
అందాలు ఆరబోసే ఓ బంగారు బొమ్మా!
ఆలోచించు ! ఒక్కసారి ఆలోచించు !
అందమైన నీ తనువు చక్కని అద్దమే
ప్రతిబింబం చూసుకొని ప్రతిఒక్కరు సిద్దమే

నీ స్టేటస్ మరచి నీవు నీచంగా ఆలోచిస్తే
మూర్కంగా ప్రవర్తిస్తే ముగ్గురు కాదు
ముక్కోటి దేవతలు సిద్దంగా ఉంటారు
నిన్ను శపించేందుకు అందుకే
అందాలు ఆరబోసే ఓ బంగారు బొమ్మా!
ఆలోచించు ! ఒక్కసారి ఆలోచించు !

నీవు నీతితప్పిన జాతితో జతకడితే
నీ జన్మధన్యం కాదు శూన్యమే
నిజం నిప్పులాంటిది నీతితప్పకు
సత్యాన్ని సమాధి చేయకు సంఘం ఒప్పుకోదు
బరితెగించి తిరగకు బజారున పడకు
వేషం వేశ్యలావుంటే అందరికీ అసహ్యమే
అందుకే అందాలు ఆరబోసే ఓ బంగారు బొమ్మా!
ఆలోచించు ! ఒక్కసారి ఆలోచించు !

నీ వెనుక నీచులుంటారు
నీ ముందే ధనపిశాచులుంటారు వారు
కోరేది నీ సుఖాన్ని నీ శ్రేయస్సునుకాదు
నీ మెడలో బంగారాన్ని నీ పర్సులో డబ్బుని
బెడ్ మీదకి నీవు చేరగానే
ఒంటిలో వేడి ఆరగానే రెడ్ లైట్ ఏరియాలో
నీ అమ్మకం ఖాయం అందుకే
అందాలు ఆరబోసే ఓ బంగారు బొమ్మా!
ఆలోచించు ! ఒక్కసారి ఆలోచించు !

నీ ప్రక్కనే నక్కలా నక్కినక్కి
తిరిగే నరరూప రాక్షసులంటారు
కుక్కలా కక్కినదానికి
ఆశపడే కసాయివాళ్ళుంటారు
మాయమాటలు చెప్పే మాయగాళ్ళుంటారు
పచ్చిమోసగాళ్ళుంటారు అందుకే
అందాలు ఆరబోసే ఓ బంగారు బొమ్మా!
నమ్మకు నమ్మకు ఎవరినీ "నమ్మకు"
అమ్మనాన్నల పరువును అంగటిలో సరుకులా"అమ్మకు"