Facebook Twitter
ఏమిటీ ఈ సృష్టి రహస్యం!

ఆహా ! ఓహో ! ఔరా !
ఏమిటీ ఈ వింత సృష్టి ?
ఈ విశ్వమంతా
ఏమిటీ ఈ సృష్టి రహస్యం ?
ఎంత శక్తిమంతుడో...
ఎంతటీ దయాలుడో...
ఎంతటి మహిమాస్వరూపుడో...
కదా ఆ సృష్టికర్త
ఈ సువిశాల ప్రపంచంలో
ఎన్నెన్ని
వింతలో...
విశేషాలో...
విడ్డూరాలో...
చిత్ర విచిత్రాలో
ఆశ్చర్య చకితులను చేసే...
ఎన్నెన్ని అద్భుతాలో...
అంతుచిక్కని
ఎన్నెన్ని రహస్యాలో...
ఆకాశాన
ఎన్నెన్ని
రమణీయమైన...
మనోహరమైన...
ఆహ్లాదకరమైన...
అద్భుత దృశ్యాలో...
గాయపడిన మనసుకు
స్వాంతన చేకూర్చే
ఎన్నిమందులు మాయలు
దాగివున్నాయో గదా
అటు ఆకాశంలో
పక్షులకు "పళ్ళు ఫలాలు"...
అటు మూగజీవాలైన
పశువులకు "చెట్ల ఆకులు"...
ఇటు భూమిపై నరులకు
భుక్తికోసం "పచ్చని పంటలు"...
తన భక్తుల ముక్తికోసం
ఎన్నిగుళ్ళు గోపురాలో‌‌...
ఈ మనిషి మేధస్సుకు
అందనిదే...
అర్థంకానిదే...
అంతుచిక్కనిదే...
ఆ భగవంతుని వింతసృష్టి !

ఎంత బావుండు ! ఎంత బావుండు !

మంచినీళ్లడిగితే‌ మజ్జిగో
పాలిచ్చే‌ మంచి శ్రీమతి వుంటే
ఎంత బావుండు ! ఎంత బావుండు !

హీరో హోండా బైకడిగితే
మారుతీ కారుకొనిచ్చే నాన్నవుంటే
ఎంత బావుండు ! ఎంత బావుండు !

ఫీజులేమీ అడగకుండా
ఫ్రీగా వైద్యంచేసే ఫ్యామిలి డాక్టరుంటే
ఎంత బావుండు ! ఎంత బావుండు !

డ్రంక్&డ్రైవ్ లో పట్టుబడితే కొట్టకుండా
కేసు పెట్టకుండా వదిలేసే పోలీసులుంటే
ఎంత బావుండు ! ఎంత బావుండు !

ఆకలేస్తే ఆకేసి పప్పన్నం
పెట్టమంటే బిర్యాని పెట్టే మిత్రుడుంటే
ఎంత బావుండు ! ఎంత బావుండు !

వడ్డీలేకుండా ఋణాలను
మంజూరుచేసే బ్యాంకు మేనేజర్లుంటే
ఎంత బావుండు ! ఎంత బావుండు !

కాడెద్దులిమ్మంటే ఖరీదైన ట్రాక్టర్ నిచ్చే
సోనుసూద్ లాంటి ఆపద్భాంధవులుంటే
ఎంత బావుండు ! ఎంత బావుండు !

కాని,చూసి రండర్రా అని పంపిస్తే,కాల్చి
బూడిద పట్టుకొచ్చే...సిబ్బంది వుంటేనే
కాస్త ఇబ్బంది కాసింత కష్టం!కూసింత నష్టం!