Facebook Twitter
ప్రకృతి ఒక అద్భుత వర్ణచిత్రం...

అంతులేని
ఈ అనంత విశ్వంలో
ఈ సకలచరాచరసృష్టిలో
అపురూపమైన
అతి సుందరమైన
అతి మనోహరమైన
ఆ ప్రకృతి అందచందాలను 
కనులారా తిలకించి మనసారా
పులకించిపోని వారెవ్వరు ?
ఈ రెండు కళ్ళు సరిపోవు
తనివితీరా తిలకించాలంటే
కోటికావాలి కోరిక తీరాలంటే

సృష్టిలో ప్రతిజీవి ఆకలినితీర్చే
"అన్నదాత ఎవరు ?ఆ దైవమే"...

బాధతో విలవిల్లాడే మన
మనసును ఉల్లాస పరిచేది
బంగారు బహుమతులను
అందించి ఆనందపరిచే 
"క్రిస్మస్ తాత ఎవరు ‌?ఆ దైవమే"...

జంతువుల పక్షుల జబ్బులను
మనుష్యుల మానసిక
రుగ్మతలను రూపుమాపే
"వైద్యుడు ఎవరు ?ఆ దైవమే"...

ఎవరూ చిత్రించలేని ఊహించలేని
ఎన్నో ఇంపైన రంగులతో సర్వసృష్టిని
రసరమ్య భరితంగా తీర్చిదిద్దిన గొప్ప
"చిత్రాకారుడు ఎవరు ?ఆ దైవమే"...

అందమైన అతిసుందరమైన వివిధ
రూపాల్లో జీవులను
అద్భుతంగాచెక్కిన గొప్ప
"శిల్పాకారుడు ఎవరు ?ఆ దైవమే"....

నీ నా ఉనికికి ఊపిరైన
ఆ దైవాన్ని నిరంతరం స్మరించడం...
నిత్యం జపించడంతోనేగా
మన ఈ మానవజన్మసార్థకమయ్యేది!