Facebook Twitter
ఆహా ! ఎంత వింత సృష్టి ఇది !

గలగల పారే సెలయేరులను
జలజల దూకే జలపాతాలను
కిలకిల నవ్వే పక్షులను
తళతళ మెరిసే తారలను తిలకించి
పులకించనివాడు తిక్కశంకరరుడేరా!

పూచే పూలు వీచే గాలి పారేనదులు
పండే పొలాలు ఎగిరే పక్షులు
ఎండలు వానలు కొండలు కోనలు
ఔరా ఔరా ఎంత చూసినా
ఈ వింతసృష్టి తనివి తీరనిదేరా!

చలిచీమల్ని మదపుటేనుగుల్ని
సృష్టించినవాడే గంగిగోవుల్ని
గాండ్రించే పులుల్ని సృష్టించేనురా
సహజీవనం సమానత్వమే ఈ సృష్టిధర్మంరా!

కాయమంటే కాసేనా మండుటెండలు
కురవమంటే కురిసేనా కుంభవర్షాలు
శాస్త్రజ్ఞులకన్నా దాగిఉన్న ఆదైవశక్తే మిన్నరా!

లెక్కపెట్టగవచ్చు నింగిలోని చుక్కల్ని...
నీటిబిందువుల్ని... లెక్కపెట్టగవచ్చు
చెట్టులోని ఆకుల్ని...జుట్టులోని వెంట్రుకల్ని
లెక్కపెట్టగలేనివి రెండేరా...అవి
మనిషి జననం...మనిషి మరణమేరా!

పూస్తే పూలు పులకించారు
కాస్తే కాయలు కరిగిపోయారు
మెరిస్తే మేఘాలు మురిసిపోయారు
కురిస్తే వర్షాలు కుమిలిపోయారు జనానికి
అంతుచిక్కనివి ఇలలో...జలప్రళయలేరా!

కడలి కడుపున కల్లోలం రేగి
తీరందాటితే తుఫాను హోరుగాలులు వీచి
కుంభవర్షాలు కురిసి ఉప్పెనలే వస్తే పాపం
బలైపోయేది ప్రకృతి ప్రళయానికి బలహీనులే గదరా!
అన్న పోలన్న సుభాషితం విన్న మీకు శుభోదయమే!