ప్రేమ ఒక మాయా ? లోయా ?
ఒక్కసారి ఎక్కడైనా ఎప్పుడైనా
పార్కులో పరిచయమై
పక్కున నవ్వితే చాలు
కుక్కలా వెంటపడతారు
ఒక్కసారి ఎక్కడైనా ఎప్పుడైనా
సినిమాలో కూర్చుని
పక్కున నవ్వితే చాలు
నక్కలా వెతుకుతారు
ఒక్కసారి ఎప్పుడైనా ఎక్కడైనా
లక్కీగా హోటల్లో
హాయ్ అంటే చాలు
లక్కలా అతుక్కుపోతారు
ఏమంటే ప్రేమంటారు
అసలది ప్రేమే కాదని ఆకర్షణని
కళ్లుపొరలు కమ్మిన కామంధులకు
కన్నవాళ్ళు కాని కట్టుకున్నవాళ్ళు కానీ
కన్నబిడ్డలు కానీ కళ్ళకు కనిపంచరని
అది ప్రేమ కాదని ఒక మాయని
"మాయకాదు ఒక పెద్దలోయని"
తెలిసేసరికి తెల్లవారిపోతుంది
అందుకే అన్నారు ఆంగ్లకవులు
Love is blind
where as lovers find
Moon in the Noon అని....



