Facebook Twitter
అదిగో అల్లదిగో ఆనీలి ఆకాశంలో

ఏడురంగుల ఇంద్రధనస్సులా...
కోటి ప్రభల సూర్యబింబంలా...
ఎగిరే ముత్యాల మురిపాల ముచ్చటైన నా
మువ్వన్నెల జెండా‌ ఏమన్నది? ఏమన్నది ?
నీతి నిజాయితీతో నిప్పులా బ్రతకమన్నది
నిర్భయంగా..... తలలెత్తుకు తిరగమన్నది

ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల,జాతినేతల
జైలు జీవితాల, త్యాగమూర్తుల రక్తతర్పణాలకు
ప్రతిఫలమే...మన అర్థరాత్రి స్వాతంత్ర్యమన్నది

సర్వమతాలకు కులాలకు నిలయమన్నది
భిన్నత్వంలో ఏకత్వమే...మన నినాదమన్నది
ప్రజాస్వామ్యమే... మనకు ఆరవప్రాణమన్నది
అదే మన భరతమాతకు... స్వర్ణాభరణమన్నది
అంబేద్కర్ రాజ్యాంగమే మనకు రక్షణ కవచమన్నది

అహింసావాది గాంధీజీ ప్రథమ ప్రధాని చాచా నెహ్రూ
సర్దార్ వల్లభాయ్ పటేల్ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్
అల్లూరి సీతారామరాజుల,త్యాగాలే మనకు పునాదన్నది

ఇందిరా రాజీవ్ అటల్ బిహారీ వాజపేయి అబ్దుల్ కలాం

జాతినేతల అమరవీరుల ఆశయాలే మనకు ఊపిరన్నది