ఆ సృష్టికర్త తత్వమేమిటో?
నీకు నాకు భగవంతుడిచ్చిన
సమయం 24 గంటలే కాని...
నీవు పగలంతా "రెస్ట్ "తీసుకొని
రాత్రిపూట "వర్క్" చేస్తావు
నేను పగలంతా "వర్క్ "చేసి
రాత్రిపూట" రెస్ట్ "తీసుకుంటాను
నీ రక్తమైనా నా రక్తమైనా
ఎవరి రక్తమైనా ఎర్రగానే ఉంటుంది
కాని, మన బ్లడ్ గ్రూపులు వేరువేరు
నీ చేతికైనా నా చేతికైనా వేళ్ళు ఐదే
కాని, మన వేలిముద్రలు వేరు వేరు
నీవైనా నావైనా మరెవరివైనా
కనిపించని మన నుదిటి వ్రాతలు
కనిపించినా అర్థంకాని చేతిగీతలు వేరువేరు
నీ శక్తిసామర్థ్యాలు తెలివితేటలు వేరువేరు
నాశక్తిసామర్థ్యాలు తెలివితేటలు వేరువేరు
మనలో ఒకరు విజయశిఖరాలు అధిరోహిస్తే
మరొకరు ఏ అథఃపాతాళానికో జారిపోతారు
ఎందుకో ఏమిటో ఏకత్వంలో ఈ భిన్నత్వం
ఎవరికీ ఎంతకూ అర్థం కాకున్నది ఆసృష్టికర్తతత్వం



