ఓ భక్తా గ్రేసరులారా !
ఓ దైవమా మీరెక్కడంటూ
కష్టాలలో వున్నాం కాపాడమంటూ
పగలురేయి మీరు పిల్లాపాపలతో
గుళ్ళుగోపురాలు తిరిగేరు
వెర్రివారిలా వెతికేరు
గుడి మెట్లు ఎక్కేరు
విగ్రహాలకు మొక్కేరు
ఓ భక్తా గ్రేసరులారా !
విగ్రహాలు మీ ఇంద్రియాల
నిగ్రహం కోసమే
అందుకే
ఎంతోఎత్తైన కొండలమీద
పాలరాతితో ప్రకృతి ఒడిలో
మీరెంతో
అందమైన సుందరమైన
అద్బుతమైన అతిఖరీదైన
గుళ్ళుగోపురాలనుకట్టినా
గర్భగుడిలో ఘనంగా
విగ్రహాలు ప్రతిష్టించినా
ఆర్భాటంగా అర్చనలు చేసినా
ఆ దైవం మాత్రం
కొలువై వుండేది
గుళ్ళల్లోకాదు మీ గుండెల్లోనే



