ఆ పరమాత్మకు నా ప్రార్ధన ఒక్కటే
ఈ నూతన సంవత్సరంలో.....
మీ శ్రేయోభిలాషిగా నే ఆశించే దొక్కటే
మీ నిర్ణయాలు నిజాయితీగా వుండాలని
మీ క్రియలు ఆచరణాత్మకంగావుండాలని
ఈ నూతన సంవత్సరంలో.....
ఆపరమాత్మను నే అర్థించేదొక్కటే
మీ కలన్నీ పండాలని
మీ కోరికలన్నీ తీరాలని
మీ ఆశలన్నీ నెరవేరాలని
ఈ నూతన సంవత్సరంలో.....
ఆ పరమాత్మను నే కోరేదొక్కటే
మీ ముఖాలు చిరునవ్వుతో వెలగాలని
మీ వెంట సుఖశాంతులుండాలని
మీ ఇళ్లు సిరిసంపదలతో నిండాలని
మీ జీవితాల్లో వరాలవర్షం కురవాలని
ఈ నూతన సంవత్సరంలో.....
ఆ పరమాత్మకు నా ప్రార్ధన ఒక్కటే
మీరు మీ కుటుంబ సభ్యులందరు
ప్రశాంతమైన బ్రతుకు బ్రతకాలని
ఆయురాగ్యైశ్వర్యాలతో వర్ధిల్లాలని



