ప్రసాధించవా ఓ పరమాత్మా!
ఈ నూతన సంవత్సరంలో....
కరుణను కురిపించే
"కళ్లను"
ఆపదలో ఉన్నవారిని ఆదుకునే "హస్తాలను"
పడినవారిని లేపడానికి పరుగులుతీసే
"పాదాలను"
మాకు ప్రసాదించవా ఓ పరమాత్మా!
ఈ నూతన సంవత్సరంలో....
నిష్కల్మషమైన "దృష్టిని"
నిర్మలమైన "మనసును"
స్వచ్చమైన "హృదయాన్ని"
పచ్చని "జీవితాన్ని"
మాకు ప్రసాదించవా ఓ పరమాత్మా!
ఈ నూతన సంవత్సరంలో....
మల్లెలా పరిమళించే "మనసును"
పరులను ప్రేమించే "హృదయాన్ని"
అనాధలకు సేవచేసే "భాగ్యాన్ని"
మాకు అందించవా ఓ పరమాత్మా!



