ముందుజన్మలో ముక్తి
నిత్యం
స్మశానాల్లో
సమాధుల మధ్య
సంచరించే శివుని
శిరమున పాతాళగంగ
కరమున త్రిశూలం
కంఠంలో కాలకూటవిషం
మెడలో విషసర్పాలే
శివునికి పూలహారాలు
మీరు సైతం శంకర స్వరూపులే
మీరు బలహీనులుకాదు
భగవత్ స్వరూపులు
మీ కళ్ళను మీ కళలను
మీ కండరాలను విశ్వసించాలి
ఆత్మబలంతో ఆత్మవిశ్వాసంతో
అనంతాత్మను నమ్మాలి
పురాణాల్లో పుట్టిన
ముక్కోటిదేవతలపై విశ్వాసమున్నా
మీపై మీకు విశ్వాసం లేకున్న
ముందుజన్మలో మీకు ముక్తి సున్న



