భగవంతుడా ? కారణం? కాదు మరెవరు?
కొందరు పైకి
మంచిమనుషుల్లా
కళ్ళకు కనిపించినా
మంచిగా మాట్లాడరు
ప్రేమనెవ్వరికీ పంచరు
ప్రశాంతంగా జీవించరు
చెట్టుమీది కాకుల్లా అరుస్తారు
పగబట్టిన త్రాచుల్లా కాటేస్తారు
వీధిలో కుక్కల్లా మొరుగుతారు
గడ్డిమేసే పశువుల్లా ప్రవర్తిస్తారు
కల్లుత్రాగిన కోతుల్లా చిందులు వేస్తారు
నమ్మకంగా వుంటారు నక్కల్లా నటిస్తారు
అంటే జన్మ మనిషిదే కాని ప్రవర్తనే పశువుది
దీనికి కారణం కనిపించని ఆ భగవంతుడా? కాదు
చచ్చిపోయిన మనిషిలోని మంచితనం మానవత్వం
వానిలోని నీచమైన క్రూరమైన విషపూరితమైన వ్యక్తిత్వం



